Karam Poditho Kadilina Chelle (Jagore Jago) Song Lyrics was available in both English and Telugu. This song was sung by Singer Madhu Priya and Music was given by Bheems Ceciroleo and lyrics was written by Burra Sathish, video edited by Venkata Krishna. Credits Janasena Party.
Jagore Jago Song Lyrics In Telugu:
కారం పొడితో కదిలిన చెల్లె
రోకలి బండలు ఎత్తిన పల్లె – “2”
ఉప్పెనలా కదిలెను ఊరూరు
ప్రభుత్వానిపై చేసెను పోరు
నియంత పాలన నిలువున కూల్చగ
నిప్పుకనికలై నిగ్గు తేల్చగా
సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు
జంగు నడిపిరి కూలి తల్లులు
చల్
జాగోరే జాగో కదిలిందిరా జనసేనా
జనజాతరలో నేడు రణ గర్జన జేసేనా – “2”
ఆడబిడ్డలంతా అరె అగ్గయి మండేనా
పవనన్న దండులోనా జెండయి నినదించేన- “2”
దుక్కి దున్నిన రైతు నాగలి
ఉక్కు పిడికిలై ఎగిసినాదిరా
గడ్డి కోసే నిరుపేద సెల్లెలు
గండ్ర గొడ్డలై లేసినాదిరా- 2
చెమట చుక్కల చెలిమి జేసినా
శ్రమ జీవులు అగో సైరనూదెరా
కార్మిక కర్షక అక్కలు అంతా
కదనమందునా ఖడ్గ మాయెరా-2
తిరుగుబాటు కు తిలకం దిద్ది
వీరవనితలా పౌరుషమద్ది
ఆడబిడ్డలే ఆయెను సిద్ధం
సర్కారు మీద జేయగా యుద్ధం
“జాగోరే జాగో”
ప్రజా క్షేమమే గాలికి వదిలి
పదవుల వ్యామోహంలో మెదిలి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని
ఆడుతున్నరు చూడరా ఆటా -2
అడుగడుగున అగుపడే అవినీతి
కానరాదు కాస్తయినా నీతి
అక్రమ సంపాదననే ధ్యేయం
నీట మునిగిపోయింది రా న్యాయం-2
దోపిడి దొంగల భరతం పట్టగా
సర్కారుకు అరె ఘోరి కట్టగా
సివంగులైనరు ఆడబిడ్డలు
సింహ గర్జనయి మన ఆంధ్రలో...
భల్
Jagore Jago Song Lyrics In English:
Karam poditho kadilina chelle
rokali bandalu yettina palle – “2”
uppenala kadilenu ooruru
prabhutvanipai chesenu poru
niyantha palalna niluvuna kulchaga
nippukanikalai mana andhra pallelu
jangu nadipiri kuli tallulu
chal
jagore jago kadilindhi ra janasenaa
janajatharalo nedu rana garjana jesena – “2”
adabiddlantha are aglayi mandena
pavananna dandulona jendai ninadinchena – “2”
Dukki dunnina raithu nagali
ukkupidikilai yegisinadira
gaddi kose nirupeda sellelu
gandra goddalai lesinadi ra -2
chemata chukkala chelimi jesina
shrama jeevulu ago sairanudera
karmika karshaka akkalu antha
kadanamandhuna khadga mayora -2
tirugubatuku tilakam diddi
veeravanithala paurushamaddi
adabiddale ayenu siddam
sarkaru meda jeyaga yuddam
jagore jago
praja kshemame galiki vadili
padavula vyamohamlo medili
adikaranni addupettukoni
adutunnaru chudara ata -2
adugaduguna adugu pade avineethi
kanaradhu kasthaina nithi
akrama sampadanane dheyam
nita munugipoyindhi ra nayam -2
dopidi dongala bharatam pattaga
sarkaruku are ghori kattaga
sivangulainavaru adabiddalu
simha garjana mana andhralo
bhal