Raju Yadav Chudu Song Lyrics in Telugu & English –

Raju Yadav Chudu Song Lyrics చంద్రబోస్ అందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా రామ్ మిరియాల పాడిన ఈ పాట ‘రాజు యాదవ్’ చిత్రంలోనిది.

Raju Yadav Chudu Song Lyrics in English

Raju Yadav
Nedu Nee Raasthaalokochhaadu
Raju Yadav Veedu
Ninnu Ranini Chesesthaadu

Raju Yadav Chudu Song Lyrics in Telugu

ఏయ్, నన్నే చూశావే
నువ్వు నన్నే నన్నే చూసినావే
నవ్వే నవ్వావే
చిరునవ్వుల దారి చూపినవే

నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటినే
నీ నవ్వుతోనే నిలువెల్లా నవ్వుకుంటినే
ఒక్క చూపుతోనే గతమంతా జారిపోయెననే
ఒక్క నవ్వుతోనే బ్రతుకంతా మారిపోయేనే

రాజు యాదవ్
నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్
వీడు నిన్ను రాణిని చేసేస్తాడు ||2||

అమ్మా నాన్న కన్న నువ్వే
బంధువుల కన్న నువ్వే
స్నేహితుల కన్న నువ్వే
ఎంతో ఎక్కువ అయ్యావే.

తెల్లవారగానే నువ్వే
చీకటవ్వగానే నువ్వే
మళ్ళీ తెల్లవారుతుందన్న
ఆశే నువ్వయ్యావే

చెప్పక చెయ్యక వచ్చి వాలావే
నా బాట నా మాట మార్చేసావే
చప్పున నీ వైపు తిప్పుకున్నావే
తిప్పలెన్నో పెంచావే

ఒక్క చూపుతోనే
మనసంతా లాగేస్తున్నావే
ఒక్క నవ్వుతోనే
ప్రాణమంతా ప్రేమౌతున్నదే

రాజు యాదవ్
నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్
వీడు నిన్ను రాణిని చేసేస్తాడు ||2||

నేలపైన కాలు ఉన్నా
నింగిలోన తేలుతున్న
నిన్ను నేను తలచుకున్నా
తియ్య తియ్యని క్షణనా.

సంతోషాల జల్లులోనా
సంబరాల వరదలోనా
కొట్టుకొని పోతు ఉన్నా
నిన్నే కలిసే క్షణానా.

నాలోన ఊపిరి ఉన్నంతవరకు
నా గుండె చప్పుడు ఆగే వరకు
తనువంత మన్నులో కలిసేంత వరకు
నేను నీ కోరకు…

ఒక్క చూపుతోనే
జీవితాన్నే కదిపేస్తున్నావే
ఒక్క నవ్వుతోనే
జాతకాన్నే కుదిపేస్తున్నావే

రాజు యాదవ్
నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్
వీడు నిన్ను రాణిని చేసేస్తాడు ||2||

Watchరాజు యాదవ్ Video Song

Raju Yadav Chudu Song Lyrics Credits

Leave a Comment