Rakhi Punnami Rammanna Song Lyrics – Releare Ganga Songs

Rakhi Punnami Rammanna Song Lyrics was available in both English and Telugu. This song was sung by singer Relare Ganga and Music was given by Ravi Kalyan and lyrics was given by Kodari Srinu.

Rakhi Punnami Rammanna Song Lyrics In Telugu:

రాఖి పున్నమి రమ్మన్నా రాలేక పోతున్న
బంధం తెలియని మనుషుల మధ్య
బంధీ అయి పోతున్న
రాఖి పున్నమి రమ్మన్నా రాలేక పోతున్న
బంధం తెలియని మనుషుల మధ్య
బంధీ అయి పోతున్న
ఎదురు సుడకుర్రి అన్నో
ఎలమంచే తొవ్వల్లా
నేనెట్ల రాను ఊరూల్లో
పల్లేరు గట్లల్లా
ఎదురు సుడకుర్రి అన్నో
ఎలమంచే తొవ్వల్లా
నేనెట్ల రాను ఊరూల్లో
పల్లేరు గట్లల్లా

సిన్నపుడు సిరులై
సీత జడల పూలై
అట కోయిల పలుకై
అమ్మ లాలీ పాటై
ఇంటి ముంద్రరా మొగ్గై
విరిసే మల్లె మొగ్గై
నను గావురంగ పెంచినవో
ఓ రాసవారి ఇల్లాళ్ల
రాకాసి కొంపల్లో వేసినవో
చేయసాల అయ్యే బ్రతుకల్లా
ఎదురు సుడకుర్రి అన్నో
ఎలమంచే తొవ్వల్లా
నేనెట్ల రాను ఊరూల్లో
పల్లేరు గట్లల్లా
రాఖి పున్నమి రమ్మన్నా రాలేక పోతున్న
బంధం తెలియని మనుషుల మధ్య
బంధీ అయి పోతున్న

అత్త గారి ఇంట్లో అర వందల బ్రతుకు
కట్టుకున్న తోడు కసాయి తీరు
అత్త తిట్టే తిట్లు అరకుళ్ల తుళ్లు
నను సీకటి బాయిల వేసిండ్రో
సింతలు తీరని బాధల్లా
కునుకు లేని రాత్త్రుల్లే
నాకు తోడుగా దుఃఖంలా
ఎదురు సుడకుర్రి అన్నో
ఎలమంచే తొవ్వల్లా
నేనెట్ల రాను ఊరూల్లో
పల్లేరు గట్లల్లా
రాఖి పున్నమి రమ్మన్నా రాలేక పోతున్న
బంధం తెలియని మనుషుల మధ్య
బంధీ అయి పోతున్న

కట్నాలిచ్చే దాక
నా కాళ్ళకి బంధాలే గా
పుట్టినింటి తోవ
మరిసి పోతినవ్వా
అందొరల్లే నేన్ను
ఆడ బిడ్డను దేవ
పుట్టి పెరిగిన వాడల్ల
ఆడబిడ్డ రకల్లా
రాఖీ కట్టిన బాధల్లే
నేనెందుకు బ్రతుకుడు

SONG DETAILS:
Song Name: Rakhi Punnami Rammanna Song
Lyrics & Direction: Kodari Srinu
Singer & Casting: Relare Ganga
Music: Ravi Kalyan
Label & Channel Managed by: One Media.

Leave a Comment